Vijay: జార్జియాలో యాక్షన్ మొదలెట్టేసిన విజయ్!

Vijay 65th movie shooting started in Georgia
షార్ట్స్‌లో చూడండి
'మాస్టర్' సినిమాతో కొత్త రికార్డులను తిరగరాసిన విజయ్, తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది విజయ్ కి 65వ సినిమా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇటీవలే రెగ్యులర్ షూటింగుకు శ్రీకారం చుట్టింది. తాజా షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ జార్జియా వెళ్లింది. ఈ రోజున అక్కడ ఈ సినిమా షూటింగు మొదలైంది. విజయ్ పై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, విజయ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. విజయ్ సరసన ఛాన్స్ రావడంతో .. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో పూజ హెగ్డే ఫుల్ ఖుషీ అవుతోందట. ఈ సినిమాకిగాను పారితోషికంగా ఆమె 3 కోట్లు అందుకుంటోందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో కొత్త విలన్ ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నారట. సన్ పిక్చర్స్ వారు అత్యధిక భారీ బడ్జెట్ తో  సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Vijay
Pooja Hegde

More Telugu News