KTR: కేటీఆర్ చేతుల మీదుగా హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభం

open newly constructed RUB developed under the Strategic Road Development Program
షార్ట్స్‌లో చూడండి
కేటీఆర్ చేతుల మీదుగా హైద‌రాబాద్‌లోని హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి ఈ రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఇంకా మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్డీపీ)లో భాగంగా కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో రూ.66.59 కోట్ల వ్యయంతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జిని నిర్మించారు.
          
దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు  తొలగిపోనున్నాయి. గతంలో పాత బ్రిడ్జి కింద నిత్యం 35 నుంచి 40వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది.  అందులోనే వాహనదారుల రాకపోకలు కొన‌సాగించేవారు. కాగా, ఈ బ్రిడ్జి ప్రారంభోత్స‌వం ముందు హైద‌రాబాద్‌లోని మూసాపేటలో బీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

అంబేద్కర్ నగర్‌ నుంచి డంపింగ్‌ యార్డు వరకు ఆ రోడ్డు నిర్మాణం జరగనుంది.  కైతలాపూర్‌లో డంపింగ్‌ యార్డు సమస్య ఉందని, స్థానికులకు ఇబ్బంది లేకుండా చెత్త తరలింపు పాయింట్‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ చెప్పారు. వ‌ర్షాకాలంలో ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు చేపడతామ‌ని తెలిపారు.
Go Back to Shorts
KTR
TRS

More Telugu News