Corona Virus: తెలంగాణ‌లో వెయ్యి దాటిన కొత్త క‌రోనా కేసులు

  • ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురి మృతి
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,819
  • మృతుల సంఖ్య 1,712
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 283 మందికి క‌రోనా  
  Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 1,078 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 331 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,207 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,712గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 6,900 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,116 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 283 మందికి క‌రోనా సోకింది.

తెలంగాణ‌లో క‌రోనా కేసుల పూర్తి వివ‌రాలు...
 

More Telugu News