భవనంపై నుంచి దూకి కెనడాలో తెలంగాణ విద్యార్థి సూసైడ్
- నల్లగొండ జిల్లాలోని డిండి మండలానికి చెందిన ప్రవీణ్
- ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం కెనడాకు విద్యార్థి
- ఆత్మహత్యపై పోలీసుల ఆరా
అతని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రుల పేర్లు నారాయణరావు, హైమావతి. వారిది సాధారణ రైతు కుటుంబం. ఉన్నత ఆశయాలతో తమ కుమారుడు కెనడాకు వెళ్లి చదువుకుంటున్నాడని వారు చెప్పారు. కలను నెరవేర్చుకోవాలనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ వారు విలపించారు. ప్రవీణ్ కుమార్ మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .