తిరుపతిలో ప్రచారం చేయనున్న బాలకృష్ణ.. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
Add ap7am to your home Screen

తిరుపతిలో ప్రచారం చేయనున్న బాలకృష్ణ.. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

TDP sent star campaigners list to EC
  • తిరుపతిలో చంద్రబాబు సహా 30 మంది ప్రచారం
  • స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈసీకి పంపిన టీడీపీ
  • తిరుపతి బరిలో మాజీ మంత్రి పనబాక లక్ష్మి
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఆ పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేసిన టీడీపీ దానిని ఎన్నికల సంఘానికి పంపింది.

ఇక ఈసీకి పంపిన ఆ జాబితాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ సహా 9 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, ఐదుగురు ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
Tirupati LS Bypolls
TDP
Panabaka Lakshmi
Balakrishna

More Telugu News