అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇక వర్తించదు... బీసీసీఐ కీలక నిర్ణయం!
- ఇంగ్లండ్ తో సిరీస్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాలపై విమర్శలు
- ఐపీఎల్ నిబంధనల ప్రకారం కొత్త నిర్ణయం
- సొంతంగా నిర్ణయం ప్రకటించనున్న థర్డ్ అంపైర్
కాగా, ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 సిరీస్ లో సూర్యకుమార్ ఇచ్చిన క్యాచ్ ని ఇంగ్లండ్ అటగాడు డేవిడ్ మలాన్ డైవ్ చేస్తూ పట్టుకోగా, ఆ బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. అయితే, గ్రౌండ్ లో ఉన్న అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ గా అవుట్ ను ప్రకటించడంతో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని థర్డ్ అంపైర్ దాన్ని అవుట్ గా ప్రకటించాడు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో ఐపీఎల్ లో ఇటువంటి తప్పులు చోటు చేసుకోకుండా చూడాలని భావించిన బీసీసీఐ, ఫీల్డ్ అంపైర్ తో సంబంధం లేకుండా, తనకు రిఫర్ చేసిన బాల్స్ లో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం లభించనుంది.