Corona Virus: దేశంలో కొత్త‌గా 39,726 మందికి కరోనా

India reports 39726 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. గ‌త‌ 24 గంట‌ల్లో 39,726 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 20,654 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,14,331కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 154 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,370 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,83,679  మంది కోలుకున్నారు. 2,71,282 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,93,39,817 మందికి వ్యాక్సిన్లు వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,13,70,546 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,57,383 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News