పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో డీఎంకే జెండా ఊపిన నేత
- పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు
- కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంపకం చర్చలు
- తనకు సీటు దక్కదేమోనని భావించిన కాంగ్రెస్ నేత వెంకటేశన్
- పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం
- డీఎంకే జెండా చేతబూని సమావేశానికి వచ్చిన వైనం
- రసాభాసగా మారిన సమావేశం
వెంకటేశన్ ను అడ్డుకునేందుకు ఓ నాయకుడు ప్రయత్నించగా, అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఎన్నికలపై చర్చించడానికి నిర్వహించిన ఆ సమావేశం బాహాబాహీకి వేదికగా మారింది. వేదికపై పార్టీ అగ్రనేతలు ఉండగానే పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలు తమ కండబలం చూపించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇస్తోంది.