మరికాసేపట్లో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. రెండు గంటల్లో తొలి ఫలితం
- ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
- 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం
- లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అలాగే, రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలోనూ మొత్తం 490 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఓట్ల లెక్కింపు సందర్బంగా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా, రెండు గంటల్లోనే తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.