మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ తో కాదు.. బద్రుద్దీన్ అజ్మల్ పార్టీతోనే!: బీజేపీ
- అసోంలో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్
- అసోం సంస్కృతిని బద్రుద్దీన్ నాశనం చేస్తున్నారన్న బీజేపీ
- భారతీయతే బీజేపీ నినాదమని వ్యాఖ్య
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, అసోం ఇన్ఛార్జి వైజయంత్ జే పాండా మాట్లాడుతూ, తమ ఉనికి కోసమే ఏఐయూడీఎఫ్ తో కాంగ్రెస్ జతకట్టిందని విమర్శించారు. అసోం బచావ్ అని కాకుండా... కాంగ్రెస్ బచావో అనే నినాదాన్ని ఆ పార్టీ ఎత్తుకోవాలని అన్నారు. అజ్మల్ ను దివంగత తరుణ్ గొగోయ్ మతతత్వవాది అనేవారని చెప్పారు. భారతీయతే బీజేపీ నినాదమని అన్నారు. అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి విడత పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.