చాన్నాళ్ల తర్వాత.. తెలుగు సినిమాలో అనుపమ్ ఖేర్!

Anupam Kher in a Telugu movie after decades
  • 1987లో 'త్రిమూర్తులు'లో నటించిన అనుపమ్
  • చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్
  • ధన్వంత్రి పాత్రలో నటించడానికి అంగీకారం  
అనుపమ్ ఖేర్ ఎంతటి ప్రతిభావంతుడైన నటుడో హిందీ సినిమాలతో పరిచయం వున్న వాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలనీ.. కామెడీ.. పాథాస్.. క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన శైలిలో అభినయించి మెప్పించే నటుడాయన. అలాంటి ఆ బాలీవుడ్ నటుడు గతంలో 1987లో వెంకటేశ్ హీరోగా కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన 'త్రిమూర్తులు' తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ తెలుగు సినిమాలో నటించడానికి అనుపమ్ అంగీకరించారు.

నిఖిల్ హీరోగా  చందు మొండేటి దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'కార్తికేయ' సినిమా మంచి హిట్టయింది. ఇప్పుడు దీనికి ఇదే కలయికలో సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రకు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పాత్ర నచ్చడంతో చేయడానికి ఆయన కూడా హ్యాపీగా అంగీకరించినట్టు సమాచారం. ఇందులో ఆయన ధన్వంత్రి అనే విభిన్నతరహా పాత్రను పోషిస్తున్నారట.
Go Back to Shorts
Anupam Kher
Nikhil
Chandu Mondeti
Venkatesh

More Telugu News