పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పున‌కు గొప్ప సంకేతం: ప‌వ‌న్ క‌ల్యాణ్
Add ap7am to your home Screen

పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పున‌కు గొప్ప సంకేతం: ప‌వ‌న్ క‌ల్యాణ్

pawan praises janasainiks
  • మా పార్టీకి 27 శాతం ఓటింగ్ ద‌క్కింది
  • ఇది యువ‌త‌, ఆడ‌ప‌డుచులు, అభ్యుద‌య‌వాదుల విజ‌యం
  • జ‌న‌సైనికులకు అభినంద‌న‌లు
పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం మార్పున‌కు గొప్ప సంకేతమ‌ని ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు. త‌మ పార్టీకి 27 శాతం ఓటింగ్ ద‌క్కింద‌ని చెప్పారు. ఇది యువ‌త‌, ఆడ‌ప‌డుచులు, అభ్యుద‌య‌వాదులు సాధించిన విజ‌య‌మ‌ని అన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌లు ఏ రాజ‌కీయ పార్టీకైనా చాలా కీల‌క‌మైన‌వ‌ని చెప్పారు.

గ్రామ స్వ‌రాజ్యం, గ్రామీణాభివృద్ధి, ప‌ల్లెలే దేశానికి ప‌ట్టుకొమ్మ‌ల‌ని ఆయ‌న తెలిపారు. తాను పంచాయ‌తీల ప‌రిస్థితుల‌ను స్వ‌యంగా వీక్షించాన‌ని చెప్పారు. ఆయా గ్రామాల్లో స‌రైన‌ వ‌స‌తులు లేవ‌ని అన్నారు. తాను రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ప‌ర్య‌టించాన‌ని తెలిపారు. ప్ర‌తి గ్రామంలో జ‌న‌సైనికులు ఉన్నార‌ని తెలుపుతూ ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎన్నిక‌ల్లో అన్ని అడ్డంకుల‌ను ఎదుర్కొని విజయం సాధించిన జ‌న‌సైనికులకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

  
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News