Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వాయిదా పడిన సమంత వెబ్ సీరీస్ 
  • రవితేజ సినిమాలో బాలీవుడ్ నటుడు
  • మణిరత్నం తాజా చిత్రం అప్ డేట్
  • 19న వస్తున్న సుమంత్ 'కపటధారి'    
Samantas web series gets postponed

*  అందాలభామ సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ విడుదల వాయిదా పడింది. ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా విడుదల కావలసిన ఈ సీరీస్ ను వేసవికి వాయిదా వేసినట్టు సీరీస్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెలిపారు.
*  రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' సినిమాలో బాలీవుడ్ నటుడు నికితిన్ ధీర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిన్ననే నికితిన్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. మరో కీలక పాత్రను అనసూయ పోషిస్తున్న విషయం విదితమే.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రం షూటింగ్ గత కొన్ని వారాలుగా హైదరాబాదులో జరుగుతోంది. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయినట్టు చెబుతున్నారు. ఈ వారంలో హీరో విక్రమ్ కూడా ఈ షూటింగులో జాయిన్ అవుతాడట.  
*  అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కథానాయకుడుగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న 'కపటధారి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

More Telugu News