RRR: దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు 'ఆర్ఆర్ఆర్'... అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటన!

  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
  • ప్రధాన పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్
  • అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
  • నీరు, నిప్పు కలిసిన శక్తి అంటూ చిత్రయూనిట్ ప్రకటన
RRR release date announced by unit

అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాలు మోసుకువస్తున్న ఈ చిత్రం దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నీరు, నిప్పు కలిసి ఓ శక్తిలా మారితే ఎలా ఉంటుందో ఈ ఏడాది అక్టోబరు 13న చూస్తారంటూ చిత్రబృందం రిలీజ్ డేట్ ప్రకటించింది.

ఇలాంటి ఉత్పాతాన్ని మునుపెన్నడూ చూసి ఉండరని పేర్కొంది. భారత సినిమా చరిత్రలో అతి పెద్ద భాగస్వామ్యంతో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక స్వారీ షురూ అంటూ పేర్కొన్నారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

More Telugu News