RRR: ఆర్ఆర్ఆర్ నుంచి మీరు ఎదురు చూస్తోన్న అప్‌డేట్ వ‌చ్చేస్తోంది: ఎన్టీఆర్‌, రామ్ చ‌రణ్‌

  • ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు అప్‌డేట్‌
  • సినిమా విడుద‌ల తేదీపై ప్ర‌క‌ట‌న‌?
  • ట్రైల‌ర్ గురించి అప్‌డేట్‌?
Biggest announcement 2 PM Today

దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న అస‌లు సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఓ కీల‌క అప్‌డేట్ వ‌స్తుంద‌ని ఆ సినిమా బృందం ప్ర‌క‌టించింది. ప్రేక్ష‌కులు ఏ ప్ర‌క‌ట‌న కోసం ఎదురు చూస్తున్నారో దాన్ని చెబుతామ‌ని చెర్రీ, తార‌క్ స‌హా ఆర్ఆర్ఆర్ సినిమా బృందంలోని దాదాపు అంద‌రూ ట్వీట్లు చేశారు.  

ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ లకు సంబంధించిన టీజ‌ర్‌ల‌ను ఇప్ప‌టికే సినిమా బృందం విడుద‌ల చేసింది. యంగ్‌ ఎన‌ర్జిటిక్ హీరోలు ఈ సినిమాలో న‌టిస్తుండ‌డం, బాహుబ‌లి వంటి భారీ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి ఈ సినిమా తీస్తుండ‌డంతో ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా? అని ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు.

దీంతో ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తారా? లేక ట్రైల‌ర్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తారా? మ‌రేదైనా విష‌యం గురించి చెబుతారా? అంటూ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా ప్ర‌క‌టిస్తూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతోన్న విష‌యం తెలిసిందే.

More Telugu News