పెనుకొండ కోటలో దొరికిన హిందూ దేవతల విగ్రహాలను నిర్లక్ష్యంగా పడేశారు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy says idols dumped on ground
  • పెనుకొండ వద్ద పురాతన విగ్రహాలు లభ్యం
  • పురావస్తు శాఖ పట్టించుకోవడంలేదన్న విష్ణు
  • నేలపైనే వదిలేశారని ఆరోపణ
  • సీఎం జగన్ కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. పెనుకొండ వద్ద విజయనగర కోటలో పురాతనమైన హిందూ దేవతల విగ్రహాలు దొరికాయని, అయితే ఆ విగ్రహాల పట్ల జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఆ ప్రాచీన విగ్రహాలను రాష్ట్ర పురావస్తు శాఖ ఏమాత్రం పట్టించుకోకుండా నేలపై పడేసిందని తెలిపారు. ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదని, అందుకు బాధ్యులైన అధికారులపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 
Go Back to Shorts
Vishnu Vardhan Reddy
Idols
Fort Vijayanagar
Penukonda
Jagan
Andhra Pradesh

More Telugu News