ఏపీలో సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ ఆదేశాలు!
- 10 నుంచి ప్రారంభం కానున్న సెలవులు
- 8 రోజుల పాటు కొనసాగనున్న సెలవులు
- ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ
10వ తేదీ ఆదివారం, 11న అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేను ప్రకటించిన అధికారులు, ఆపై 17 వరకూ సెలవుల తరువాత, 18న పాఠశాలలు తిరిగి తెరచుకుంటాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 21 నుంచి జరగాల్సిన 7, 8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలను ఫిబ్రవరి 8కి మార్చినట్టు కూడా అధికారులు వెల్లడించారు. విద్యార్థుల సిలబస్ పూర్తి కాలేదని ఉపాధ్యాయులు పేర్కొన్న నేపథ్యంలోనే పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి డైరెక్టర్ బి. ప్రతాప్ రెడ్డి వెల్లడించారు.