మ్యూజియంలుగా దిలీప్ కుమార్, రాజ్ కపూర్ నివాసాలు... పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం
- దేశవిభజనకు పూర్వం పాక్ లో జన్మించిన నట దిగ్గజాలు
- ఇప్పటికీ నిలిచి ఉన్న వారి పూర్వీకుల భవనాలు
- భవనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేసిన స్థానిక ప్రభుత్వం
దీనిపై ఖైబర్ పఖ్తుంక్వా ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు కమ్రాన్ బంగాష్ మాట్లాడుతూ, పెషావర్ లోని దిలీప్ కుమార్ నివాసం, రాజ్ కపూర్ కు చెందిన భవంతిని కొనుగోలు చేసేందుకు నిధులు మంజూరు చేశారని, వాటిని మ్యూజియంలుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. దేశవిభజనకు పూర్వం ఉన్న సంస్కృతిని పునరుజ్జీవింప చేయడం, పెద్దసంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా తమ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.