Monkey: తన బిడ్డను అచ్చం మనిషిలానే లాలించిన మర్కటం... వీడియో ఇదిగో!

  • ఆకట్టుకుంటున్న కోతి చేష్ట
  • బిడ్డను ఎత్తుకుని గిరగిరా తిరిగిన వానరం
  • శిశువుపై మమకారం చాటిన వైనం
  • వీడియోను పంచుకున్న అటవీశాఖ అధికారి
Monkey plays with her child

కోతి నుంచి అనేక దశల తర్వాత మనిషి పుట్టాడంటారు. కొన్నిసార్లు కోతుల చేష్టలు గమనిస్తే అది నిజమే అనిపించేలా ఉంటాయి. తాజాగా ఓ వానరం తన పిల్లను అచ్చం మనిషిలానే లాలించడం ఓ వీడియోలో దర్శనమిచ్చింది. చంటిబిడ్డను చేతుల్లో పొదువుకుని ఎంతో మురిపెంతో గిరగిరా తిరుగుతూ తల్లి ప్రేమను చాటింది. శిశువు పట్ల తల్లి వాత్సల్యం ఎలా ఉంటుందో చూపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ అటవీశాఖ అధికారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

More Telugu News