Rashmika Mandanna: ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ?

Rashmika opposite NTR in his next
షార్ట్స్‌లో చూడండి
'అరవింద సమేత' సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా పనులలో  నిమగ్నమయ్యారు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ రెడీ కాగా, ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం తాను చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రం షూటింగు మొదలవుతుంది.

కాగా, ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయమై గత కొన్నాళ్లుగా పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూజ హెగ్డే, రష్మిక, కియరా అద్వానీ .. వంటి ముద్దుగుమ్మల పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, కథానాయికగా రష్మికను ఫైనల్ చేశారట. తెలుగు, హిందీ భాషల్లో ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక అయితే, తమ ప్రాజక్టుకు మరింత క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్రకు ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రను తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. విలన్ పాత్రకు వున్న ప్రాధాన్యతను బట్టి టాలెంటెడ్ నటుడైన ఉపేంద్ర అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయనను ఫిక్స్ చేశారట.
Go Back to Shorts
Rashmika Mandanna
Jr NTR
Trivikram Srinivas

More Telugu News