కరోనా నుంచి కోలుకున్నా.. సంతోషంగా ఉంది: రకుల్ ప్రీత్ సింగ్
Add ap7am to your home Screen

కరోనా నుంచి కోలుకున్నా.. సంతోషంగా ఉంది: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh tests negetive with Corona
  • గత వారం కరోనా బారిన పడిన రకుల్
  • ఇప్పుడు చాలా బాగున్నానన్న ముద్దుగుమ్మ 
  • 2021 కోసం ఎదురు చూస్తున్నానని వ్యాఖ్య
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ గత వారం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

'తాజా టెస్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మంచి ఆరోగ్యంతో, సానుకూల దృక్పథంతో 2021ని ప్రారంభించేందుకు ఆగలేకపోతున్నాను' అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అంతేకాదు తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందరూ బాధ్యతగా ఉండాలని, మాస్కులు ధరించి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.

గత వారం తనకు కరోనా సోకినట్టు తెలిసిన వెంటనే ఆ విషయాన్ని అభిమానులతో రకుల్ పంచుకుంది. తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని... త్వరలోనే కోలుకుని, మళ్లీ షూటింగుల్లో పాల్గొంటానని చెప్పింది. 
Rakul Preet Singh
Tollywood
Corona Virus
Bollywood

More Telugu News