Niharika: తన పెళ్లి ఫొటోల్లో నిహారికకు బాగా నచ్చిన పిక్ ఇది!

  • ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వివాహం
  • గుంటూరు యువకుడు చైతన్యను పెళ్లాడిన నిహారిక
  • ‘ఐ లవ్ దిస్ పిక్’ అంటూ నిహారిక పోస్ట్
niharika pic goes viral

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవల మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు యువకుడు చైతన్యల వివాహం జరిగిన విషయం తెలిసిందే.  ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇటీవల నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. వాటన్నింటిలో తనకు బాగా నచ్చిన ఫొటోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. నిహారికకు మంగళ స్నానం చేయిస్తోన్న సందర్భంగా ఈ ఫొటోను తీశారు.

‘ఐ లవ్ దిస్ పిక్’ అంటూ నిహారిక పేర్కొంది. ఈ ఫొటో నెటిజన్లను కూడా అలరిస్తోంది. కాగా, ప్ర‌స్తుతం నిహారిక, చైతన్య మాల్దీవుల్లో హ‌నీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వారం రోజుల తర్వాత వారు తిరిగి హైద‌రాబాద్‌కు రానున్నారు.

More Telugu News