Mohan Babu: ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!: మోహన్ బాబు ఆహ్వానం

go to balaji temple say mohan babu
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో తిరుమల దేవస్థానం రీతిలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని సినీనటుడు మోహన్ బాబు కోరారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో గతంలో తనకు కలిగిన అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

గతంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లగానే ఒక్క క్షణం తన కళ్లను తానే నమ్మలేకపోయానని చెప్పారు. తాను తిరుమలలోని శ్రీనివాసుడిని దర్శించుకున్నట్లే అనిపించిందని తెలిపారు. ఆ ఆలయాన్ని దర్శించుకున్న ఏ భక్తుడిని అడిగినా ఇదే మాట చెబుతున్నారని ఆయన తెలిపారు. ప్రజలందరికీ వెంకటేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.  
  
Go Back to Shorts
Mohan Babu
Tollywood

More Telugu News