హైదరాబాదులో నయనతార, విఘ్నేశ్ జంట!
- హైదరాబాదులో రజనీ, నయన్ ల చిత్రం షూటింగ్
- ఇక్కడే షూటింగ్ జరుపుకుంటున్న విఘ్నేశ్ చిత్రం
- కరోనా కండిషన్లతో కలవలేకపోతున్న నయన్, విఘ్నేశ్
వీరిద్దరూ కలవకపోవడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమానే కారణమట. రజనీ తాజా చిత్రం 'అన్నాత్తే' షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార నటిస్తోంది. విఘ్నేశ్ తెరకెక్కిస్తున్న 'కాదు వాకుల రెండు కదల్' సినిమా షూటింగ్ కూడా హైదరాబాదులోనే జరుగుతోంది. అయితే, కరోనా భయాలతో చిత్ర యూనిట్ ఎవరూ బయట వారిని కలవకూడదని నిబంధన విధించారట. దీంతో, ఈ ప్రేమ పక్షులు ఒకే చోట ఉన్నప్పటికీ విడివిడిగానే ఉంటున్నారట.