Corona Virus: భారత్‌లో కోటికి చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

Indias total cases rise to 9979447
షార్ట్స్‌లో చూడండి
దేశంలో గత 24 గంటల్లో 22,889 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,79,447కు చేరింది. ఇక గత 24 గంటల్లో 31,087 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 338 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,44,789కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,20,827 మంది కోలుకున్నారు. 3,13,831 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,89,18,646 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,13,406 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News