Venkatesh: 'నారప్ప'గా విక్టరీ వెంకటేశ్ అదుర్స్ ... టీజర్ విడుదల!

  • నేడు వెంకటేశ్ పుట్టిన రోజు
  • గంటల వ్యవధిలో 1.7 మిలియన్లకు పైగా వ్యూస్
  • వెంకీ యాక్టింగ్ పై ప్రశంసల వర్షం
Venkatesh Latest Movie Narappa Teaser Goes Viral

నేడు విక్టరీ వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'నారప్ప' టీజర్ విడుదలైంది. ఇందులో వెంకటేశ్ అద్భుతంగా కనిపిస్తున్నాడని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ టీజర్ విడుదలైన గంటల వ్యవధిలోనే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం గమనార్హం.

కాస్తంత నెరిసిన గుబురు గడ్డం, తలకు ఆకుపచ్చని తలపాగా, పంచెకట్టుతో కనిపిస్తున్న వెంకీ అందరినీ అలరిస్తున్నారు. కళ్లల్లో రౌద్రాన్ని చూపుతున్న నారప్ప స్టయిల్, ఈ చిత్రంలో అతని పాత్ర ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ టీజర్ చూసిన వారంతా వెంకీ చూపిన హావభావాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీజర్ ను మీరూ చూసేయండి.

More Telugu News