మళ్లీ బుల్లితెరకు.. రియాలిటీ షోకి హోస్టుగా ఎన్టీఆర్!
- గతంలో 'బిగ్ బాస్' షోకి హోస్టుగా ఎన్టీఆర్
- తాజాగా మరో రియాలిటీ షోకి గ్రీన్ సిగ్నల్
- షూటింగ్ కోసం అన్నపూర్ణలో సెట్స్
- త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్
ఈ కోవలో గతంలో ఎన్టీఆర్ కూడా 'బిగ్ బాస్' షోకి హోస్టుగా వ్యవహరించాడు. తనదైన శైలిలో ఆ షోని రక్తికట్టించాడు. ఈ క్రమంలో మరోసారి ఈ యంగ్ టైగర్ బుల్లితెరపై కనిపించి, అభిమానులను అలరించనున్నట్టు తెలుస్తోంది.
ఓ టీవీ ఛానెల్ నిర్వహించే రియాలిటీ షోకి హోస్టుగా వ్యవహరించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సెట్స్ కూడా వేస్తున్నారట. త్వరలోనే ఆ సెట్స్ లో షోకి సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల కోసం షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.