భారత్ లో పర్యటించనున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు... వేదికలు ఖరారు
- ఫిబ్రవరి 5 నుంచి భారత్ లో ఇంగ్లాండ్ టూర్
- 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న ఇంగ్లాండ్
- కరోనా వ్యాప్తి కారణంగా కేవలం 3 వేదికల్లోనే మ్యాచ్ లు
- చెన్నై, అహ్మదాబాద్, పుణే నగరాల్లో మ్యాచ్ లు
- సంయుక్త ప్రకటన చేసిన బీసీసీఐ, ఈసీబీ
టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 5న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, ఆ తర్వాతి రెండు టెస్టులు అహ్మదాబాద్ లో నిర్వహిస్తారు. ఇక టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుండగా, అన్ని మ్యాచ్ లు అహ్మదాబాద్ లో జరుగుతాయి. అనంతరం, మార్చి 23న వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ మ్యాచ్ లన్నీ పుణేలో నిర్వహిస్తారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.