RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అలియా భట్.. జక్కన్నతో ఫొటోలు

A very warm welcome to our dearest sita
షార్ట్స్‌లో చూడండి
యంగ్ హీరోలు‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌' (రౌద్రం రణం రుధిరం) చిత్రంలో బాలీవుడ్‌ కథానాయిక అలియాభట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. సీత పాత్రలో నటించడానికి గాను ఆమె హైదరాబాద్‌లోని ఆర్‌ఆర్‌ఆర్ సెట్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆ సినిమా బృ‌ందం పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలతో రాజమౌళితో ఆమె ముచ్చటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్‌తో పాటు ఒలీవియా మోరిస్ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ కనిపిస్తోన్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌కు (అల్లూరి) జోడీగా సీత పాత్రలో ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
Go Back to Shorts
RRR
Rajamouli
Jr NTR

More Telugu News