ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో ప్రారంభమైన రీపోలింగ్
- సీపీఐ అభ్యర్థి గుర్తుకు బదులు సీపీఎం గుర్తు ముద్రణ
- అభ్యర్థి గుర్తించడంతో నిలిచిపోయిన పోలింగ్
- నేడు ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు
రీపోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఓల్డ్ మలక్‌పేటలోని 26వ డివిజన్‌లో మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, మొత్తం 54,655 మంది ఓటర్లున్నారు. మొన్నటి పోలింగ్ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేయడంతో నేడు మధ్య వేలికి వేయనున్నారు.