హైదరాబాద్ లో హై అలర్ట్... ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు!
- ఎన్నికలు ముగిసేంత వరకూ ప్రత్యేక సెల్
- స్పెషల్ బ్రాంచ్ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో ఏర్పాటు
- సమస్యలు తలెత్తకుండా చూస్తామన్న యంత్రాంగం
వచ్చే నెలలో ఫలితాలు వచ్చేంత వరకూ ఈ విభాగం కొనసాగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఎక్కడికక్కడ బందోబస్తును పెంచాలని, గతంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన చోట్ల మరింత దృష్టిని సారించాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగివున్న వారంతా, వాటిని స్థానిక పోలీసు స్టేషన్లు లేదా, ఆయుధ డీలర్ల వద్ద డిపాజిట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.