Alia: 'ఆర్ఆర్ఆర్' సెట్స్ కి అలియా రాక మరింత ఆలస్యం?

  • ఇటీవలే మొదలైన 'ఆర్ఆర్ఆర్' షెడ్యూల్ 
  • ప్రస్తుతం యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
  • ఈ నెల తొలి వారంలో రావలసిన అలియా 
  • హిందీ సినిమా షూటింగులో స్టకప్   
Alia Bhats joining RRR shoot delays further

కరోనా మహమ్మారి దెబ్బ టాలీవుడ్ లో 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి బాగా పడింది. అసలే భారీ కాంబినేషన్లు.. భారీ షెడ్యూళ్లు.. దానికితోడు లాక్ డౌన్ తో ఏడు నెలలు షూటింగ్ ఆగిపోయింది. దాంతో షెడ్యూల్స్ అన్నీ అప్సెట్ అయ్యాయి. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఇదే నెలలో బాలీవుడ్ భామ అలియా భట్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ కావాల్సివుంది. డేట్స్ కూడా ఇచ్చిందని అన్నారు. అయితే, ఆమె ఇప్పటికీ షూటింగులో జాయిన్ కాలేదు. కారణం, ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం 'గంగూభాయ్ కథియావాడి' షూటింగులో వుంది.

ముంబైలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగు షెడ్యూలు ఈ నెల తొలివారంలో ముగియాల్సి వుంది. అయితే, షూటింగును అనివార్య కారణాల వల్ల మరో రెండు వారాలు పొడిగించారట. దాంతో అలియా కూడా ఆ షూటింగులో స్టకప్ అయిపోయింది. దీంతో ఆమె 'ఆర్ఆర్ఆర్'కి రావడం మరింత లేట్ అవుతుందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె లేని సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరించడానికి దర్శకుడు రాజమౌళి షెడ్యూల్ మార్చుకున్నట్టు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్, చరణ్ కూడా ఈ చిత్రం షూటింగు పూర్తయితేనే ఇతర చిత్రాలు మొదలుపెడతారు. అయితే, ఇది లేట్ అవ్వడం వల్ల వాళ్ల తదుపరి చిత్రాలు కూడా ముందుకు పోతున్నాయి.

More Telugu News