Rana Daggubati: యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన రానా

  • 'సౌత్ బే' పేరుతో యూట్యూబ్ ఛానల్
  • వివిధ భాషల కంటెంట్ ను చూసే అవకాశం
  • ట్యాలెంట్ వున్న వారికి అవకాశాల కల్పన
Actor Rana starts Youtube Channel

లాక్ డౌన్ నేపథ్యంలో జనాలకు సినిమా థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో... వారంతా ఓటీటీతో పాటు ఇతర మాధ్యమాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో సినీ నటుడు రానా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. ఈ ఛానల్ కు 'సౌత్ బే' అనే పేరు పెట్టాడు. వివిధ భాషల కంటెంట్ ను ఈ ఛానల్ లో చూడొచ్చు. 10 సెకన్ల నుంచి 10 గంటల నిడివితో వివిధ భాషలకు చెందన కథలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ట్యాలెంట్ వున్న వారికి తగు అవకాశాలను ఈ ఛానెల్ లో కల్పించబోతున్నారు. కేవలం కథలే కాకుండా వార్తలు, యానిమేషన్, ఫిక్షన్ అంశాలకు సంబంధించిన వివరణ కూడా ఉంటుంది.

More Telugu News