RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్ వీడియోను పోస్ట్ చేసిన సినిమా బ‌ృందం

  • బ్రిటిష్ వారితో హీరోలు పోరాడుతోన్న సీను చిత్రీకరణ
  • చాలా రోజులుగా నైట్ షూట్
  • యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ
RRR shoting video

'బాహుబలి' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ వారితో ఇందులోని హీరోలు పోరాడుతోన్న సీన్లకు సంబంధించిన షూటింగును తీస్తున్నట్లు తెలుస్తోంది.  చాలా రోజులుగా నైట్ షూట్ తీస్తున్నామని, యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ చెప్పింది.

దీన్ని థియేటర్‌లో చూసేటప్పుడు మరో లెవల్లో ఉంటుందని ఆ యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు.  కాగా, ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఇటీవల ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే  ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ఇంతకుముందే ప్రేక్షకులకు పరిచయం చేసింది.


More Telugu News