Poonam Pandey: శృంగార తార పూనం పాండేపై కేసు నమోదు

  • గోవాలో అసభ్య వీడియోను చిత్రీకరించిన పూనం పాండే
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం
  • చపోలీ డ్యామ్ పవిత్రతను దెబ్బతీసిందని ఆరోపణ
Police case filed on Poonam Pandey

బాలీవుడ్ శృంగార తార పూనం పాండేపై పోలీసు కేసు నమోదైంది. ఆమె చేసిన ఒక అసభ్య వీడియోపై ఈ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గోవాలో ఈ వీడియోను ఆమె చిత్రీకరించింది. దీనిపై గోవాకు చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గోవాలోని చపోలీ ఆనకట్ట వద్ద పూనం ఈ వీడియోను షూట్ చేసిందని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ డ్యామ్ ను గోవా ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారని... ఆ పవిత్రతను పూనం దెబ్బతీసేలా ప్రవర్తించిందని, గోవా సంస్కృతిని పూనం దెబ్బతీసిందని ఆరోపించారు. పూనంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది.

More Telugu News