Ajay Devghan: 'ఆదిపురుష్'లో అజయ్ దేవగణ్ నటించడం లేదట!

  • శివుడి పాత్రలో అజయ్ నటిస్తున్నట్టు ప్రచారం
  • ఈ వార్తలను ఖండించిన అజయ్ టీమ్
  • అజయ్ ను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చిన వైనం
Ajay Devghan not acting in Adipurush

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ 'ఆదిపురుష్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. శివుడి పాత్రలో అజయ్ దేవగణ్ నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

 అయితే ఈ ప్రచారాన్ని అజయ్ దేవగణ్ టీమ్ ఖండించింది. 'ఆదిపురుష్' సినిమా కోసం అజయ్ ను ఎవరూ ఇంత వరకు కలవలేదని చెప్పింది. ఈ ప్రచారానికి ఇప్పటికైనా ముగింపు పడుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు సీత పాత్రకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రాలేదు. ఈ పాత్రకు అనుష్క శర్మ, అనుష్క శెట్టి, కియారా అద్వాణీ, కృతిసనన్ పేర్లు వినిపించాయి.

More Telugu News