K Kavitha: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత విజయ దుందుభి

kavita wins in nizamabad
షార్ట్స్‌లో చూడండి
తాజాగా జరిగిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల‍్వకుంట్ల కవిత విజయ దుందుభి మోగించారు.  నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన కౌంటింగ్ లో టీఆర్ఎస్‌కు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు రాగా, చెల్లని ఓట్లు 10గా నమోదయ్యాయి. మొత్తం 823 ఓట్లు పోలయ్యాయి. దీంతో భారీ ఆధిక్యంతో కవిత విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ  చేసిన విషయం తెలిసిందే. కాసేపట్లో కవితకు ఎన్నికల గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు  అందజేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత‌ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకుంటున్నారు.
Go Back to Shorts
K Kavitha
TRS
Nizamabad District

More Telugu News