Srikanth: నాటి 'పెళ్లిసందడి'లో తండ్రి.. నేటి 'పెళ్లిసందడి'లో తనయుడు?

  • పాతికేళ్ల క్రితం 'పెళ్లిసందడి' సంచలనం
  • ఇప్పుడు రాఘవేంద్రరావు మరో 'పెళ్లిసందడి'
  • శ్రీకాంత్ కు స్టార్ స్టేటస్ తెచ్చిన నాటి సినిమా
  • నేటి 'పెళ్లిసందడి'లో తనయుడు రోషన్?    
Srikanths son Roshan in latest Pelli sandadi

సుమారు పాతికేళ్ల క్రితం వచ్చిన 'పెళ్లిసందడి' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది. చిన్న తారాగణంతో కె.రాఘవేంద్రరావు ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అప్పటివరకు ఏవో సినిమాలు చేస్తూ వస్తున్న హీరో శ్రీకాంత్ కు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది.

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు వెలువడిన ప్రకటన టాలీవుడ్ లో ఓ సంచలనమైంది. ఇక ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారంటూ టాలీవుడ్ లో అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో రోషన్ పేరు బాగా వినిపిస్తోంది. హీరో శ్రీకాంత్ తనయుడే ఈ రోషన్. ఆమధ్య నాగార్జున నిర్మించిన 'నిర్మలా కాన్వెంట్' అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.

ఈ కొత్త 'పెళ్లిసందడి'కి రోషన్ ని రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్ కు ఆ 'పెళ్లిసందడి' ఎంతగా హెల్ప్ అయిందో.. ఇప్పుడు రోషన్ కెరీర్ కు ఈ 'పెళ్లిసందడి' కూడా అంతగానూ హెల్ప్ అవుతుందని చెప్పచ్చు!  

More Telugu News