రేపు కొత్త సినిమా ప్రకటన చేయనున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
- మూడేళ్లుగా సినిమా జోలికి వెళ్లని దర్శకేంద్రుడు
- రేపు ఉదయం 11.30 గంటలకు ముహూర్తం ఖరారు
- కొత్తవాళ్లతో దర్శకేంద్రుడి చిత్రం?
ఇప్పుడు తాజాగా కొత్త వాళ్లతో సినిమా తీయాలని రాఘవేంద్రరావు ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఆయనే నిర్మాత అని సమాచారం. రాఘవేంద్రరావు ఆస్థాన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తారని తెలుస్తోంది.