ఇటలీ వెళ్లనున్న నితిన్, కీర్తి సురేశ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇటలీ వెళ్లనున్న నితిన్, కీర్తి సురేశ్?

Rang De shoot planned in Italy
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే'
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
  • ఇటలీలో సన్నివేశాలు, పాటల చిత్రీకరణ 
  • ఈ నెలాఖరులో ఇటలీకి ప్రయాణం   
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగుకి లాక్ డౌన్ వల్ల ఆరు నెలల పాటు అంతరాయం కలిగింది. లేకపోతే ఈపాటికి రిలీజ్ కూడా అయిపోయేది. ఇప్పుడు మళ్లీ ఈమధ్య ఈ చిత్రం షూటింగును ప్రారంభించారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో కొనసాగిస్తున్నారు.

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సమాచారం తాజాగా అందుతోంది. కథ ప్రకారం గతంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూలును ఇటలీలో ప్లాన్ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో అప్పుడు దానిని కేన్సిల్ చేసుకుని, ఆ షూటింగును కూడా హైదరాబాదులోనే కానిచ్చేద్దామని అనుకున్నారు.

అయితే, ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో మళ్లీ ఇటలీలో షూటింగ్ చేయాలని భావిస్తున్నారట. అందుకే, కాస్త రిస్క్ తీసుకుని ఇటలీకి వెళ్లి కొన్ని సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాలని యూనిట్ తాజాగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో అక్కడికి వెళతారని అంటున్నారు.
Nithin
Keerti Suresh
Venky Atluri

More Telugu News