Kotamreddy Sridhar Reddy: రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వైసీపీ ఎమ్మెల్యే  కారు!

YSRCP MLA Kotamreddys car suffered with and accident
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెందిన కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తెట్టు జంక్షన్ వద్ద శ్రీధర్ రెడ్డి కారు మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీధర్ రెడ్డి కారు ముందు భాగం తుక్కుతుక్కు అయింది. ప్రమాద సమయంలో శ్రీధర్ రెడ్డి లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టైంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇంటివద్దే ఉన్నారు. ఆ సమయంలో డ్రైవర్ మాత్రమే కారులో ఉన్నాడు. అయితే, అతనికి కూడా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్ ఒక పని మీద విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై కోటంరెడ్డి కూడా ఆరా తీశారు.
Go Back to Shorts
Kotamreddy Sridhar Reddy
YSRCP
Car Accident

More Telugu News