Ramcharan: గడ్డం, మీసాలతో రామ్ చరణ్‌... ఫొటో వైరల్

  • ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన చెర్రీ 
  • ముఖానికి ఎడమవైపు మాత్రమే కనపడేలా ఫొటో
  • ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తోన్న రామ్ చరణ్
ramcharan pic goes viral

గడ్డం, మీసాలు పెంచి సినీనటుడు రామ్‌ చరణ్‌‌ తీసుకున్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. ముఖానికి ఎడమవైపు మాత్రమే కనపడేలా ఆయన తీసుకున్న ఈ ఫొటో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని పాత్రలోనిదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన ఈ సినిమాలోని వీడియో ఇప్పటికే విడులైంది. అచ్చం అందులోని పాత్రలాగే చెర్రీ పోస్ట్ చేసిన ఈ ఫొటో కూడా ఉంది.  సాధ్యమైనంత గొప్పగా ఉండండంటూ ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కొంత కాలంగా ఆయన ఇంట్లోనే గడుపుతోన్న విషయం తెలిసిందే.
   

More Telugu News