Upendra: ఉపేంద్ర సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

  • ఉపేంద్ర తాజా చిత్రం 'కబ్జ'
  • ఏడు భాషల్లో విడుదలకానున్న భారీ బడ్జెట్ మూవీ
  • దర్శకత్వం వహిస్తున్న ఆర్.చంద్రు
RGV releases Upendras Kabja movie poster

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తాజాగా 'కబ్జ' అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీధర్ లగడపాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిర్మిస్తూ ఆర్.చంద్రు స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్లో ఇప్పటికే 'బ్రహ్మ', 'ఐ లవ్యూ' చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఇది మూడో సినిమా. అండర్ వరల్డ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏడు భాషల్లో భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.

ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గన్స్ తో పాటు, గుట్టలుగుట్టలుగా పడి ఉన్న శవాలు కనిపిస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.

More Telugu News