సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Song shoot on Sai Pallavi and Naga Chaitanya
  • 'లవ్ స్టోరీ' పాట చిత్రీకరణలో సాయిపల్లవి 
  • యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రవితేజ 
  • హైదరాబాదులో షూటింగుకి రానున్న విక్రమ్ 
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం కోసం ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సాయిపల్లవి జంటపై ఈ పాటను హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.
*  ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' చిత్రంలో నటిస్తున్న హీరో రవితేజ ఇప్పటికే మరో రెండు సినిమాలను కూడా ఒప్పుకున్నాడు. మరోపక్క, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించే చిత్రంలో కూడా నటిస్తాడట. దీనిని 20 కోట్ల బడ్జెట్టులో నిర్మిస్తారని తెలుస్తోంది.
*  తమిళ హీరోలు కూడా షూటింగులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరో విక్రమ్ తన తదుపరి చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో చేయనున్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా నటిస్తున్నాడు.
Sai Pallavi
Naga Chaitanya
Raviteja
Vikram

More Telugu News