Samantha: మనసులను కదిలించే వీడియోను పోస్ట్ చేసిన హీరోయిన్ స‌మంత

  • ఆవును విడిచి ఉండ‌లేక‌పోయిన ఎద్దు
  • వాహ‌నం వెన‌కాల ప‌రుగులు
  • విప‌రీతంగా వైర‌ల్ అయిన వీడియో
samanta shares heart Touching story from India

ఓ ఆవును కొనుక్కున్న వ్య‌క్తి దాన్ని వాహ‌నంలో అక్క‌డి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుండ‌గా దాని వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దీంతో భార‌త్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న  గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసింది.

ఇటీవ‌ల ఓ రైతు త‌న ఆవును అమ్మేయ‌గా దాన్ని ఓ వాహ‌నంలో తీసుకెళ్లారు. అయితే, ఆ ఆవును వాహ‌నంలో ఎక్కించిన వెంట‌నే ఎద్దు కంగారు ప‌డిపోయింది. దాన్ని వ‌దిలేయాల‌ని వేడుకుంటున్న‌ట్లు అటూ ఇటూ తిరిగింది. దీంతో వీధిలోని వారంద‌రూ ఆశ్చ‌ర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను త‌మ స్మార్ట్ ఫోన్ల‌లో తీశారు.

అయితే, చివ‌ర‌కు ఆ ఆవును వాహ‌నంలో తీసుకెళ్లిపోయారు. చాలా దూరం వ‌ర‌కు ఆ వాహ‌నం వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇది వైర‌ల్ కావ‌డంతో ల‌క్ష‌లాది మంది దీనిపై స్పందించారు.

దీంతో చివ‌ర‌కు వారి విజ్ఞ‌ప్తులు ఆ ఆవును కొన్న వ్య‌క్తుల వ‌ర‌కు వెళ్లాయి. దీంతో ఆ రెండింటినీ మ‌ళ్లీ క‌లిపి, పూజ‌లు చేశారు. మనసులను కదిలించే ఈ వీడియోను దేశంలోని ప్ర‌ముఖులు ట్వీట్ చేస్తున్నారు. హీరోయిన్ స‌మంత కూడా ల‌వ్  సింబ‌ల్ పోస్ట్ చేసి, ఈ వీడియోను షేర్ చేసింది.

More Telugu News