కంగనాకు మద్దతుగా విశాల్.. నీ గట్స్ కు హ్యాట్సాఫ్ అంటూ లేఖ!
- నీ సమస్య కాకపోయినా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నావు
- సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని ఇచ్చావు
- భగత్ సింగ్ మాదిరి చేస్తున్నావు
'డియర్ కంగన... నీ గట్స్ కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ చేసిన మాదిరి చేస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు తమ గొంతుకను ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చావు. నీకు వందనాలు' అని విశాల్ అన్నాడు. అంతేకాదు 'వాక్ స్వాతంత్ర్యపు హక్కు (ఆర్టికల్ 19)' అని పేర్కొన్నాడు.