Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • పారితోషికాన్ని తగ్గించుకున్న రకుల్ 
  • బాలకృష్ణ సరసన నాయికగా అంజలి?
  • సింగిల్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ షూటింగ్  
Rakul cut down her remuneration

*  కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ చిత్రం కోసం తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రామీణ వాతావరణంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇది చిన్న బడ్జెట్ చిత్రం కావడంతో, ఇందులో కథానాయికగా నటిస్తున్న రకుల్ తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నట్టు సమాచారం. ఇంతకుముందు ఒక్కో సినిమాకు ఈ చిన్నది కోటిన్నర వరకు తీసుకునేది.
*  బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూడో చిత్రం షూటింగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇందులో కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తామని గతంలో దర్శకుడు చెప్పాడు. అయితే, ఆ ఆలోచనను విరమించుకుని, పాత హీరోయిన్ నే ఎంచుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అంజలిని హీరోయిన్ గా తీసుకుంటున్నారట.  
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇక మధ్యలో గ్యాప్స్ అన్నవి లేకుండా సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రం షూటింగును పూర్తిచేసేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. అలాగే షూటింగ్ మొత్తం ఇండోర్ లోనే చేస్తారని తెలుస్తోంది.  

More Telugu News