Satayadev: సత్యదేవ్ హీరోగా మరో సినిమా.. పేరు 'తిమ్మరుసు'!

Satyadev signs another movie
షార్ట్స్‌లో చూడండి
టాలెంట్ వుంటే వెనుక ఎవరూ లేకపోయినా సినిమా రంగంలో రాణించవచ్చు అని చాలామంది నిరూపించారు. అలాగే ఇటీవలి కాలంలో కూడా కొందరు తమ ప్రతిభతో చక్కని అవకాశాలను అందుకుంటున్నారు. వాళ్లల్లో సత్యదేవ్ కూడా వున్నాడు.

ఇంతకుముందు కొన్ని సినిమాలలో నటించినా ఇటీవల నటించిన 'ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రం హీరోగా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అతని అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. దీంతో అవకాశాలు అతనిని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తమన్నా సరసన 'గుర్తుందా శీతాకాలం' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ క్రమంలో తాజాగా మరో చిత్రంలో సత్యదేవ్ కి హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం పేరు 'తిమ్మరుసు'. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. 'ఎస్సైన్ మెంట్ వాలి' అనేది దీనికి ట్యాగ్ లైన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది. దీనిని మహేశ్ కోనేరు, సృజన యరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Go Back to Shorts
Satayadev
Tamannaah
Uma Maheshwara Ugraroopasya

More Telugu News