చిన్నప్పుడు సుశాంత్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. సోదరి శ్వేత భావోద్వేగభరిత వ్యాఖ్యలు
- ఒకరిని ఒకరం కాపాడుకుంటామని ప్రమాణం చేశాం
- నా మాటను నిలబెట్టుకోలేకపోయాను
- నిజాలను గుర్తిస్తాం
- నా సోదరుడికి న్యాయం చేస్తాం
ప్రస్తుతం తనతో పాటు దేశం మొత్తం తన సోదరుడికి మరో ప్రమాణం చేస్తోందని, నిజాలను గుర్తిస్తామని, తన సోదరుడికి న్యాయం చేస్తామని చెప్పుకొచ్చింది. ఆనందంతో నిండిన జీవితాన్ని తన సోదరుడు గడిపేవాడని, చిన్న పిల్లాడిలా ఉండేవాడని చెప్పింది.
సుశాంత్ కోరుకున్నది ప్రేమ మాత్రమేనని, ఎవరైనా ఒకసారి తన తల నిమురుతూ ప్రేమతో మాట్లాడితే అతడికి అది చాలని తెలిపింది. తన సోదరుడు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని చెప్పింది. అది నమ్మడానికి తన మనసు సిద్ధంగా లేదని, ఈ కేసులో నిజాలు తేలాలని చెప్పింది.