Tollywood: 'ఇలాంటి బట్టలు ఎందుకు వేశావ్?' అంటూ హీరోయిన్‌ సంయుక్త హెగ్డేపై పార్కులో దాడి.. వీడియోలు ఇవిగో

  • బెంగళూరులో ఘటన
  • స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కుకి వచ్చిన సంయుక్త హెగ్డే
  • సరిగ్గా బుద్ధి చెప్పావు అంటూ స్థానికుల సపోర్ట్
attack on heroin

'ఇలాంటి బట్టలు ఎందుకు వేశావ్?' అంటూ ఓ హీరోయిన్‌పై బహిరంగంగా ఓ మహిళ దాడి చేసింది. దాడి చేసిన మహిళకు స్థానికులంతా మద్దతు పలికారు. ఈ ఘటన బెంగ‌ళూరులోని ఓ పార్కులో చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి తన స్నేహితులతో క‌లిసి హీరోయిన్ సంయుక్త హ‌గ్డే వచ్చింది.

అది చూసిన ఓ మహిళ ఆగ్రహంతో ఆమెపై దాడి చేసింది. అక్కడే వున్న మరికొందరు మహిళలు ఆమెకు వత్తాసు పలుకుతూ, 'సరిగ్గా బుద్ధి చెప్పావు' అంటూ ప్రోత్సహించారు. అందరి మధ్య స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డం తప్పని చెప్పారు. ఇటువంటి సెలబ్రిటీలందరూ డ్ర‌గ్స్  తీసుకుంటారంటూ సంయుక్తను దాడి చేసిన సదరు మహిళ తిట్టింది. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసిన హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జ‌రిగిన ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. నిఖిల్ నటించిన 'కిరాక్ పార్టీ' సినిమాలో సంయుక్త ఓ కథానాయికగా నటించింది.

More Telugu News